Abn logo
Sep 19 2021 @ 01:15AM

రాగే కొండన్న స్మారక ఘాట్‌ ప్రారంభం

రాగే కొండన్న కుటుంబసభ్యులతో బీకే, జగదీష్‌, రాగే పరశురామ్‌ తదితరులు


అనంతపురం ప్రెస్‌క్లబ్‌, సెప్టెంబరు18 : సామాజికవేత్త రాగే కొండన్న ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన పేరిట స్మారక ఘాట్‌ను శనివారం ప్రారంభించారు. మండలంలోని కామారుపల్లి వద్ద ఏర్పాటు చేసిన స్మారక ఘాట్‌ ప్రారంభానికి పలు పార్టీల నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌, వైసీపీ నాయకులు రాగే పరశురాం పలువురు ప్రముఖులు హాజరై రాగే కొండన్న ఘాట్‌ వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ... రాగే కొండన్న ఎందరో పేదవర్గాలకు అండగా నిలిచారన్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన  అనేక సేవా కార్యక్రమాలు, ధానఽధర్మాలకు రూ. 5 కో ట్లను వెచ్చించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొండన్న భార్యలు అంజినమ్మ, ఎల్లమ్మ, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.