Jun 18 2021 @ 01:48AM

సముద్రం ఆరంభం

ఆకట్టుకునే అభినయంతో కథానాయకుడిగా, రౌద్ర రసాన్ని అద్భుతంగా పండించి ప్రతి నాయకుడిగా ప్రేక్షకులను మెప్పించారు జగపతిబాబు. సినీ, వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లను అధిగమించిన జగపతి బాబు ఆ విషయాలను ప్రేక్షకులతో పంచుకోవాలనుకుంటున్నారు. దానికోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సముద్రం: ఇట్స్‌ మై లైఫ్‌’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని జగపతిబాబు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ‘‘59 ఏళ్ల నా జీవితం గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. జూన్‌ 18 సాయంత్రం 6 గంటల నుంచి సముద్రం: ఇట్స్‌ మై లైఫ్‌ ఆరంభం. నా జీవిత విశేషాలను మీతో పంచుకోబోతున్నాను’ అని వీడియోలో జగపతి బాబు చెప్పారు.