సాంకేతికతతో సాగులో సత్ఫలితాలు

ABN , First Publish Date - 2020-06-04T09:32:13+05:30 IST

వ్యవసాయానికి సాంకేతికను జోడిస్తే మంచి ఫలితాలు సాధించొచ్చని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం ..

సాంకేతికతతో సాగులో సత్ఫలితాలు

 నెల్లిమర్ల, జూన్‌ 3: వ్యవసాయానికి సాంకేతికను జోడిస్తే మంచి ఫలితాలు సాధించొచ్చని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం రూ. 58లక్షలతో వ్యవసాయ ప్రయోగశాల భవన నిర్మాణానికి మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సాగులో ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.  అనంతరం రైతులకు సబ్సిడీపై ఎరువులు పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సురేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరాములునాయుడు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ చనమల్లు వెంకటరమణ,  వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇంజినీరింగ్‌ అధికారులు, హెచ్‌ఎంలదేనని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. మండల విద్యావనరుల కేంద్రంలో  పాఠశాలల హెచ్‌ఎంలు, ఇంజనీరింగ్‌ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.  ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, వైసీపీ నేతలు సురేష్‌బాబు, శ్రీరాములునాయుడు,  సాంబశివరావు, శ్రీనివాసరావు, ప్రసాద్‌,  పీవో కృష్ణమూర్తినాయుడు, ఎంపీడీవో కె.రాజ్‌కుమార్‌, ఎంఈవో, ఎ.కృష్ణారావు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-04T09:32:13+05:30 IST