Abn logo
Sep 20 2021 @ 23:24PM

భారత్‌ బంద్‌ విజయవంతం చేయాలి

రేగిడి, సెప్టెంబరు 20: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 27న చేపడుతున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పల నాయుడు, చెరకు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారు జనార్దనరావు కోరారు. సంకిలిలో సోమవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దీనిపై 24న మండల కేంద్రాల నుంచి బైక్‌ ర్యాలీలతో ప్రచారం చేయాలని కోరారు. సమావేశంలో రాజాం నియోజక వర్గం రైతు సంఘం అధ్యక్ష, కార్యద ర్శులు రుంకు శ్రీనివాసరావు, పాలవలస రామినాయుడు, మండల కలాసీల సంఘం ప్రతినిధి తాడేల తవిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు.