అతి పెద్ద హెయిర్‌బాల్‌!

ABN , First Publish Date - 2022-01-19T05:30:00+05:30 IST

వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, టెన్నిస్‌ బాల్‌... ఇలా రకరకాల బాల్స్‌

అతి పెద్ద హెయిర్‌బాల్‌!

వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, టెన్నిస్‌ బాల్‌... ఇలా రకరకాల బాల్స్‌ చూసుంటారు. కానీ హెయిర్‌ బాల్‌ ఎప్పుడైనా చూశారా?

అమెరికాలోని ఒహియోకు చెందిన హెయిర్‌స్టయిలిస్ట్‌ స్టీవ్‌ వార్డెన్‌ ఈ హెయిర్‌బాల్‌ను తయారుచేశాడు. అంతేకాదు ఈ బాల్‌తో గిన్నిస్‌ బుక్‌లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు.


 స్టీవ్‌ ఈ హెయిర్‌బాల్‌ తయారీ కోసం తొమ్మిదేళ్ల పాటు శ్రమించాడు. 2013లో సొంత సెలూన్‌ను ప్రారంభించిన స్టీవ్‌ అప్పటి నుంచి తన దగ్గర కొచ్చే క్లయింట్ల జుట్టును పారేయకుండా బాల్‌ తయారీకి ఉపయోగించాడు. జిగురు సహాయంతో జుట్టును అతికించి బాల్‌ను తయారుచేశాడు. 


 ఆ హెయిర్‌బాల్‌ బరువెంతో తెలుసా? వందకేజీల పైమాటే! సరిగ్గా చెప్పాలంటే 102.12 కేజీలు. ఇందుకోసం స్టీవ్‌ చాలా శ్రమించాడు. గతంలో ఒక వ్యక్తి హెయిర్‌బాల్‌తో గిన్నిస్‌రికార్డు నమోదు చేశాడు. ఇప్పుడు స్టీవ్‌ దానికంటే 25 కేజీలు ఎక్కువ బరువున్న బాల్‌ తయారుచేసి సరికొత్త రికార్డును నమోదు చేశాడు. 


Updated Date - 2022-01-19T05:30:00+05:30 IST