Advertisement
Advertisement
Abn logo
Advertisement

బింగో ప్యాకెట్ కావాలని వచ్చి చోరీ

కృష్ణా: తనకు బింగో ప్యాకెట్ కావాలని వచ్చి మహిళ మెడలో బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు.  గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ ఘటన జరిగింది. బాధిత మహిళను గ్రామానికి చెందిన గుడివాడ సత్యవతిగా గుర్తించారు. స్థానిక హైస్కూలు ఎదుట సత్యవతి దుకాణం నిర్వహిస్తున్నది.  తొలుత పెట్రోల్ అడిగి అనంతరం బింగో ప్యాకెట్ కావాలని నిందితుడు అడిగాడు. ప్యాకెట్  ఇద్దామని లేచి వెళ్తుండగా మెడలో బంగారు గొలుసు లాక్కొని ద్విచక్రవాహనంపై నిందితుడు పరార్ అయ్యాడు. లాక్కెళ్లిన గొలుసు సుమారు ఆరున్నర కాసులు(52 గ్రాములు) ఉంటుందని బాధితురాలు తెలిపింది. స్థానికంగా జరగుతున్న వరుస గొలుసు చోరీలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే మహిళలు భయమేస్తోందంటున్నారు.  


Advertisement
Advertisement