Advertisement
Advertisement
Abn logo
Advertisement

బ్రిడ్జి కింద ఉన్న డబ్బాలను తొలగించాలి


దేవరకద్ర, నవంబరు 30 : దేవరకద్ర ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న డబ్బాలను వెంటనే తొలగించాలని తహసీల్దార్‌ జ్యోతి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎస్సై భగవంతరెడ్డి సంబంధిత దుకాణ యజమానులకు సూచించారు. మంగళవారం బ్రిడ్జి కింద ఉన్న దుకాణాల వద్దకు వారు వెళ్లి వ్యాపారులకు సూచనలు చేశారు. బ్రిడ్జికి ఇరు వైపులా బీటీ వేస్తున్నారని, రేపటిలోగా డబ్బాలను తొలగించాలని, లేకపోతే చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. డబ్బాల తొలగింపునకు సంబంధించి ఇదివరకే నోటీసులు అం దించిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఈఓ సీత్యానాయక్‌, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement