Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్టీసీ మెగా రక్తదాన శిబిరం విజయవంతం

కందనూలు, నవంబరు 30 : ఆర్టీసీ ఎండి సజ్జనార్‌ ఆదేశాల మేరకు ఆర్టీసీ డిపోలో మంగళ వారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవం తమైనట్లు డీవీఎం రాము, డీఎం.శ్రీనివాసులు తె లిపారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ, వాసవి క్లబ్‌ సహకా రంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కార్మికు లు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం హర్షణీ యమని అన్నారు. ఆర్టీసీ కార్మికులు, సంస్థ సిబ్బంది విధులు నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలల్లో పాల్గొనడం వల్ల ఎంతో ప్రశాంత త కలుగుతుందన్నారు.  ప్రజల సౌకర్యం కోసం ఆర్టీసీ సంస్థ ఎన్నో రాయితీలను ప్రకటించడం తో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింద ని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.   కార్యక్రమంలో ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, రెడ్‌క్రాస్‌ సంస్థ కార్యదర్శి రమేష్‌రెడ్డి, వాసవీ క్లబ్‌ అధ్యక్షు డు కోదండరాములు, రెడ్‌క్రాస్‌ సంస్థ కో ఆర్డినేట ర్‌ కుమార్‌, ఆర్‌టీసీ సిబ్బంది తిరుపతయ్య, వి విధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

అచ్చంపేట డిపోలో..

అచ్చంపేట టౌన్‌ : రక్తదానం చేసిన వారికి ఉ చిత బస్సు సౌకర్యం కల్పించినట్లు అర్టీసీ డిపో మేనేజర్‌ భాను ప్రసాద్‌ తెలిపారు. ఆర్టీసీ ఎండి సజ్జనర్‌ ఆదేశాల మేరకు మంగళవారం  డిపోలో రక్త దాన శిబిరానిన నిర్వహిం చారు.  ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ 65 మంది ఆర్టీసీ కార్మి కులు, విద్యార్థులు రక్తదానం చే శారన్నారు. అదేవిధంగా ర క్తదానం చేసిన ప్రతీ ఒక్కరి కి కృతజ్ఞతలు తెలిపారు.  సేకరించిన రక్తాన్ని రెడ్‌ క్రాస్‌ సొసైటీకి అందజేసిన ట్లు తెలిపారు. ప్రయా ణికులు అర్టీసీ బస్సులోనే ప్రయాణించి సు రక్షితంగా గమ్యం చేరుకోవాలన్నారు. అదే విధం గా కార్గో సేవలను  వినియోగించుకోవా లన్నారు.  కా ర్యక్రమంలో ఆర్టీసీ వెల్ఫేర్‌ సభ్యులు లింగం, చంద్రయ్య, బాలాజీసింగ్‌, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.  

కల్వకుర్తి డిపోలో..

కల్వకుర్తి : రక్తదాతలందరూ ప్రాణాదాతలేనని సీఐ సైదులు అన్నారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ డిపోలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక ్తదాన శిబిరాన్ని సీఐ ఆవుల సైదులు ప్రారంభించారు. రక్తదానం చేసిన ఆర్టీసీ ఉద్యోగులను సీఐ అభినందించారు. కార్యక్రమం లో డిపో అస్టిసెంట్‌ మేనేజర్‌ ఆనంద్‌ రావు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలసుందర్‌, నాయకులు శంకర్‌, యాద య్య, నాయక్‌, శ్రీనివాసులు, కృష్ణా నాయక్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మధు తదితరులున్నారు. 

అచ్చంపేట ఆర్టీసీడిపోలో రక్తదానం చేస్తున్న విద్యార్థులు


Advertisement
Advertisement