Abn logo
Sep 21 2021 @ 00:49AM

బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు

రిలే నిరాహార దీక్షల శిబిరంలో పాల్గొన్న కార్మికులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, సెప్టెంబరు 20: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు  221వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షలలో సీఎంఎం, సీఎంఈ, ఈటీఎల్‌, టెలికాం, టౌన్‌ అడ్మిన్‌ విభాగాల కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఈ దేశాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు. పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌ మాట్లాడుతూ సీపీఐ జన జాగృతి పేరుతో మంగళవారం చేపట్టిన పాదయాత్రలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష పోరాటాలకు దిగి ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించాలని కోరారు.