ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గల్లంతవడం ఖాయం

ABN , First Publish Date - 2022-01-21T06:50:37+05:30 IST

ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అడ్రస్‌ గల్లంతవడం ఖాయమని శాసనమండలి మాజీ చైర్మన, ఎమ్మెల్సీ గుత్తా సు ఖేందర్‌రెడ్డి అన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గల్లంతవడం ఖాయం
మాట్లాడుతున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి, పక్కన నరేందర్‌రెడ్డి, రాంరెడ్డి

ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ, జనవరి 20: ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అడ్రస్‌ గల్లంతవడం ఖాయమని శాసనమండలి మాజీ చైర్మన, ఎమ్మెల్సీ గుత్తా సు ఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీలు ప్రతిపక్షంగా కనీస పాత్ర పోషించలేకపోతున్నాయని విమర్శించారు. అలాం టి పార్టీలు 2023లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్నాయని ఎద్దేవా చేశారు. వారం రోజులుగా కాంగ్రెస్‌ నా యకులు జిల్లాలో పర్యటిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఉత్తమ్‌, జానాల సమక్షంలో నే కార్యకర్తలు తన్నుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయమని పేర్కొంటుంటే నిలదీయాల్సిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధాన్యం కొనాలని కోరిన టీఆర్‌ఎ్‌సను తప్పుపట్టడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రజల కోరిక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నియోజకవర్గాల్లో రూ.1500 కోట్లతో కొత్త లిఫ్టులను చేపట్టినట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ జనరంజక పాలన అందిస్తోందని కొనియాడారు. బండి సంజయ్‌ కి సొంత నియోజకవర్గంలోనే గ్రూపులు తయారయ్యాయని, ఆ నియోజకవర్గంలోనే ఆయన గుండు పగిలే పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పా ర్టీలు నేల విడిచి సాము చేయవద్దని సూచించారు. తెలంగాణలో వ్యవసాయంతో పాటు ఐటీ సంక్షేమంతో ముందుకు దూసుకుపోతుందన్నారు. దీన్ని జీర్ణించుకోలేక, భరించలేక కాంగ్రెస్‌, బీజేపీలు విమర్శిస్తున్నాయని అన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి, జడ్పీ టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీ డర్‌ పాశం రాంరెడ్డి, జిల్లా నాయకులు యామ దయాకర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-21T06:50:37+05:30 IST