Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆమెకు 30 ఏళ్లు.. అతడికి 28 ఏళ్లు.. లాడ్జిలో అద్దెకు ఓ గది.. మర్నాడే ఖాళీ చేయమని చెప్పేందుకు సిబ్బంది వెళ్తే.. నగ్నంగా..

ఆమె వయసు 30 ఏళ్లు.. అతడికి 28 ఏళ్లు.. బుధవారం మధ్యాహ్నం పింప్రి చించివాడ‌లో ఉన్న ఓ లాడ్జిలో ఓ గది అద్దెకు తీసుకున్నారు.. అప్పట్నుంచి బయటకు రావడం మానేశారు.. చెక్ అవుట్ గురించి అడిగేందుకు లాడ్జి మేనేజర్ గురువారం మధ్యాహ్నం వారి గది వద్దకు వెళ్లాడు.. ఎంతగా బెల్ కొట్టినా లోపలి నుంచి స్పందన రాలేదు.. దీంతో సెక్యూరిటీ గార్డును పిలిపించి తలుపు బద్దలుకొట్టించాడు.. లోపల ఇద్దరూ నగ్నంగా విగత జీవులై పడిఉన్నారు.


మహారాష్ట్రలోని పింప్రి చించివాడలో ఉన్న అధర్వా లాడ్జికి బుధవారం మధ్యాహ్నం ప్రకాష్ తోమార్‌తో పాటు ఓ మహిళ వచ్చారు. గురువారం ఖాళీ చేస్తామని చెప్పి గది అద్దెకు తీసుకున్నారు. అప్పట్నుంచి బయటకు రావడం మానేశారు. దీంతో గురువారం మధ్యాహ్నం లాడ్జి మేనేజర్ ప్రకాష్ గదికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. లోపలి నుంచి స్పందన రాకపోవడంతో సెక్యూరిటీ గార్డును పిలిపించి తలుపు బద్దలుకొట్టించాడు. గది లోపల మంచంపై మహిళ శరీరం నగ్నంగా పడి ఉంది. ఆమె చీరతో ప్రకాష్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అతడి శరీరం కూడా నగ్నంగా ఉంది. 


దీంతో లాడ్జి మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టమ్‌కు తరలించారు. ముందుగా మహిళను చంపిన ప్రకాష్ తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరి మధ్యా వివాహేతర సంబంధం ఉండి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement