పలకల దేహం... పంచ్‌కు రెడీ

ABN , First Publish Date - 2020-12-06T05:30:00+05:30 IST

పలకల దేహంతో పంచ్‌ విసరడానికి సిద్ధంగా ఉన్నారు దక్షిణాది కథానాయకుడు ఆర్య. రజనీకాంత్‌తో ‘కబాలి’, కాలా’ లాంటి పలు హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన పా రంజిత్‌ దర్శకత్వంలో ఆర్య కథానాయకుడుగా నటిస్తోన్న చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది.

పలకల దేహం... పంచ్‌కు రెడీ

పలకల దేహంతో పంచ్‌ విసరడానికి సిద్ధంగా ఉన్నారు దక్షిణాది కథానాయకుడు ఆర్య. రజనీకాంత్‌తో ‘కబాలి’, కాలా’ లాంటి పలు హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన పా రంజిత్‌ దర్శకత్వంలో ఆర్య కథానాయకుడుగా నటిస్తోన్న చిత్రం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను  చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. ఉత్తర మద్రాస్‌కు చెందిన బాక్సర్ల జీవితాల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘సర్పట్టా పరంబరాయ్‌’ అనే టైటిల్‌ను ప్రకటించారు.  ఫస్ట్‌లుక్‌లో పలకల దేహంతో ఉన్న ఆర్య బాక్సింగ్‌ రింగ్‌లో పంచ్‌ విసరడానికి రెడీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణనన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆర్య ‘ఆరణ్మణై 3’, విశాల్‌తో ‘ఎనిమీ’ చిత్రంలో నటిస్తున్నారు.  

Updated Date - 2020-12-06T05:30:00+05:30 IST