ఐదు రోజులుగా మార్చురీలోనే మృతదేహం

ABN , First Publish Date - 2021-05-11T05:45:53+05:30 IST

పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మ హిళ మృతదేహం ఐదు రోజులుగా మార్చురీలోనే మగ్గింది. ఆసుపత్రి, ము న్సిపల్‌ సిబ్బంది, పోలీసులు పట్టించుకోలేదు. అంత్యక్రియలు నిర్వహించడానికి స్వచ్ఛంద సంస్థలను కూడా ఆశ్రయించారు.

ఐదు రోజులుగా మార్చురీలోనే మృతదేహం

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు


గుంతకల్లు టౌన, మే 10: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మ హిళ మృతదేహం ఐదు రోజులుగా మార్చురీలోనే మగ్గింది. ఆసుపత్రి, ము న్సిపల్‌ సిబ్బంది, పోలీసులు పట్టించుకోలేదు. అంత్యక్రియలు నిర్వహించడానికి స్వచ్ఛంద సంస్థలను కూడా ఆశ్రయించారు. మహిళ మృతి చెంది ఐదు రోజులు కావడంతో వారు ముందుకు రాలేదు. ఎట్టకేలకు సోమవా రం మున్సిపల్‌ సిబ్బంది ఆధ్వర్యంలో మహిళకు అంత్యక్రియలు నిర్వహించారు. ఐదు రోజుల క్రితం కరోనా లక్షణాలతో 50 సంవత్సరాల వయస్సు న్న గుర్తుతెలియని మహిళ ఆసుపత్రిలో చేరింది. అదే రోజు రాత్రి ఆ మ హిళ మృతి చెందింది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆమెకు సం బంధించిన బంధువులు, కుటుంబ సభ్యులు వస్తారేమోనని ఆసుపత్రి సి బ్బంది ఎదురు చూశారు.విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది పోలీసులు, ము న్సిపల్‌ అధికారులకు తెలియజేశారు. ఎవరూ రాకపోవడం, ఆమె కరోనాతో మరణించి ఉంటుందని భావించడంతో మృతదేహం అంత్యక్రియలకు నో చుకోక మార్చురీలోనే మగ్గిపోయింది. విషయం బహిర్గతం కావడంతో ఆ సుపత్రి వర్గాలు మున్సిపల్‌ అధికారులను సంప్రదించారు. మున్సిపల్‌ సి బ్బంది వచ్చి మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ వి షయంపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కమలమ్మను వివరణ కో రగా, మృతి చెందిన మహిళకు కరోనా లేదన్నారు. ఆమెను ఆసుపత్రిలో అ డ్మిట్‌ చేసిన వెంటనే కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామన్నారు. మహిళ మృతి చెందగానే మార్చురీకి తరలించి మున్సిపల్‌, పోలీసులకు సమాచారమిచ్చామని, మృతురాలి బంధువులు  వస్తారామోనని ఎదురు చూశామన్నారు. ఎవరూ రాకపోవడంతో మున్సిపల్‌ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారని తెలియజేశారు.

Updated Date - 2021-05-11T05:45:53+05:30 IST