Viral Video : రఫ్ఫాడిస్తా.. పిడిగుద్దులతో చెట్టును కూల్చిన బాక్సింగ్ బాలిక

ABN , First Publish Date - 2022-01-13T10:44:01+05:30 IST

సినిమాలలో హీరోలు చేసే స్టంట్లను నిజంగా చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ ఊహను నిజం చేసిందో 12 ఏళ్ల బాలిక. బాలిక అంటే మామూలు పిల్ల కాదు.. చిచ్చర పిడుగు. అవును ఈ బాలిక కేవలం తన చేతులతో పిడిగుద్దులు కురిపించి చెట్టును కూల్చేసింది. రష్యాకు చెందిన ఈ బాలిక పేరు ఎవ్నికా సాద్వాకాస్. ప్రపంచంలోనే బలమైన బాలికగా ఇప్పటికే రికార్డుకెక్కిన ఎవ్నికాకు బాక్సింగ్...

Viral Video : రఫ్ఫాడిస్తా.. పిడిగుద్దులతో చెట్టును కూల్చిన బాక్సింగ్ బాలిక

సినిమాలలో హీరోలు చేసే స్టంట్లను నిజంగా చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ ఊహను నిజం చేసిందో 12 ఏళ్ల బాలిక. బాలిక అంటే మామూలు పిల్ల కాదు.. చిచ్చర పిడుగు. అవును ఈ బాలిక కేవలం తన చేతులతో పిడిగుద్దులు కురిపించి చెట్టును కూల్చేసింది. రష్యాకు చెందిన ఈ బాలిక పేరు ఎవ్నికా సాద్వాకాస్. ప్రపంచంలోనే బలమైన బాలికగా ఇప్పటికే రికార్డుకెక్కిన ఎవ్నికాకు  బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టం. నాలుగేళ్ళ పసిప్రాయం నుంచే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోంది ఈ టఫ్ గర్ల్.


ఎవ్నికా తండ్రి రుస్త్రం సాద్వాకస్.. ప్రొఫెషనల్ బాక్సింగ్ కోచ్. చిన్నతనంలోనే ఎవ్నికా ప్రతిభను గుర్తించిన రుస్త్రం.. ఆమెను ఆదిశగా ప్రోత్సహించాడు. తండ్రి ప్రోత్సాహంతో ఎవ్నికా కఠోర సాధన చేసింది. ఎదురుగా ఉన్న వస్తువు ఏదైనా సరే పంచ్‌ల వర్షం కురిపించేది. ఎవ్నికా.. తమ ఇంటి సమీపంలోని అడవిలో ఉండే చెట్లపై తరచూ సాధన చేసేది. అలా ఒక చెట్టుపై మెరుపువేగంతో పిడిగుద్దులు కురిపించిన ఎవ్నికా.. క్షణాల వ్యవధిలో చెట్టును కూల్చి వేసింది. ఈ సాహస బాలిక తన చేతులతో చెట్టు కాండాన్ని సెకండ్ల వ్యవధిలో పిండి పిండి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


ఈ వీడియోని ఎవ్నికా తండ్రి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది చూసిన నెటిజన్లు..గొడ్డలి లేకుండానే చెట్టును కూల్చిన చిన్నారి ప్రతిభకు ఫిదా అయిపోయారు. “మెరుపువేగంతో ఆ బాలిక విసిరిన పంచ్‌లను చూస్తుంటేనే అర్ధం అవుతుంది అవి ఎంత బలంగా ఉన్నాయో. ఇక ఆ పంచ్‌లకు ఎదురెళ్ళే మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 



Updated Date - 2022-01-13T10:44:01+05:30 IST