మెదడును జాగ్రత్తగా కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2021-10-27T06:47:58+05:30 IST

‘ప్రతి జీవికి శరీర భాగాల్లో మెదడు చాలా ముఖ్యమైంది. శరీరంలో ో జరిగే ప్రతీ చర్య కూడా మెదడుకు సంకేతాన్ని ఇస్తుంది.

మెదడును జాగ్రత్తగా కాపాడుకోవాలి
డాక్టర్‌ అనిల్‌ పితాంబరంను సన్మానిస్తున్న స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ

తిరుపతి సిటీ, అక్టోబరు 26: ‘ప్రతి జీవికి శరీర భాగాల్లో మెదడు చాలా ముఖ్యమైంది. శరీరంలో ో జరిగే ప్రతీ చర్య కూడా మెదడుకు సంకేతాన్ని ఇస్తుంది. అలాంటి మెదడును అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అని తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ అనిల్‌ పితాంబరం అన్నారు. స్విమ్స్‌లో మంగళవారం జరిగిన 5వ వార్షిక శ్రీనివాస న్యూరోసర్జరీ ఎండోమెంట్‌ ఛైర్‌ ఓరేషన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అత్యాధునిక పద్ధతులతో, రోబోల సాయంతోనూ సులువుగా మెదడుకు శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నామని వివరించారు. స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మ, న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ రమే్‌షచంద్ర ఆయనకు బంగారు పతకాన్ని బహూకరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్‌ డీన్‌ డాక్టర్‌ అల్లాడి మోహన్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శ్రీధర్‌ బాబు, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌, సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బీసీఎం ప్రసాద్‌, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T06:47:58+05:30 IST