Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ పెళ్లికూతురు వరుడితో పాటు.. ఏ బండిలో వచ్చిందో తెలుసా..!

‘‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేతప్పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని..’’ ఈ పాట ఇటీవల ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.. పెళ్లి అప్పగింతలప్పుడు పెళ్లి కూతురు తన మనోభావాలను వివరిస్తూ.. వరుడితో చెబుతున్నట్లుగా ఉండే ఈ పాట ఎంతోమందిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పెళ్లికూతురు మాత్రం బుల్లెట్టు బండి అడగలేదు. పెళ్లిలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. వరుడితో పాటు ఎంటరైంది... చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. చాలా రోజుల కిందట జరిగిన ఈ ఘటన.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

పెళ్లి అనగానే జీవితంలో గుర్తుండిపోయేలా చేసుకోవాలని అంతా అనుకుంటారు. డబ్బులున్న వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఓ జంట తమ పెళ్లి వేడుక అంతా చర్చించుకునేలా ఉండాలనుకున్నారు. అందుకోసం సరికొత్తగా ప్లాన్ చేశారు. వరుడు షేర్వాణీ ధరించి.. వధువును రిక్షాలో ఎక్కించుకుని రావడాన్ని చూసి అంతా షాక్ అయ్యారు. వెరైటీగా ఉందంటూ చప్పట్లతో అభినందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement