వంతెన నిర్మించారు.. అప్రోచ్‌ వదిలేశారు..!

ABN , First Publish Date - 2022-01-24T04:03:53+05:30 IST

మండలంలోని వెల్లంపల్లి సమీపంలో గుండ్లకమ్మనదిపై నిర్మించ తలపెట్టిన వంతెన నిర్మాణం పూర్తయినా దానికి అనుసంధానంగా అప్రోచ్‌ రోడ్డు (వంతెన నుంచి ప్రధాన రహదారికి) ఏ ర్పాటు చేయకపోవడంతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

వంతెన నిర్మించారు.. అప్రోచ్‌ వదిలేశారు..!
నిర్మాణం పూర్తయిన వంతెన

ఆగిన గుండ్లకమ్మ రోడ్డు 8 ఏళ్లు గడుస్తున్నా సాగని పనులు

ప్రయాణికుల అవస్థలు 8 పట్టించుకోని పాలకులు

త్రిపురాంతకం, జనవరి 23 : మండలంలోని వెల్లంపల్లి సమీపంలో గుండ్లకమ్మనదిపై నిర్మించ తలపెట్టిన వంతెన నిర్మాణం పూర్తయినా దానికి అనుసంధానంగా అప్రోచ్‌ రోడ్డు (వంతెన నుంచి ప్రధాన రహదారికి) ఏ ర్పాటు చేయకపోవడంతో ప్రజలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 2007లో అప్పటి దర్శి ఎ మ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి చొరవతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. నిర్మాణంలో భా గంగా 12 పిల్లర్లకు గాను నాలుగు పిల్లర్లను నిర్మించిన కాంట్రాక్టర్‌ ఖర్చులు పెరిగిపోవడంతో చేతులెత్తేశారు. అప్పటి నుంచి సుమారు 9 ఏళ్లపాటు దీని పనులు సాగకపోవడంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి శిద్దా రాఘవరావు అదనపు నిధులు మంజూరు చే యించి 2016  ఆగస్టులో పనులను పునఃప్రారభించా రు. అయితే 247 మీటర్ల బ్రిడ్జి నిర్మాణం, 400 మీటర్ల సీసీ రోడ్డు పూర్తయ్యాయి. 2019 మార్చి 9న వంతెనను ప్రారంభించారు. కానీ వంతెనకు ఇరువైపులా అప్రోచ్‌ రోడ్డు మాత్రం నిర్మించలేదు. అప్రోచ్‌ రోడ్డు నిర్మించేందుకు రెండు వైపులాభూమి కోసం ప్రయత్నాలు చే సినా భూ యజమానుల నుంచి అంగీకారం రాలేదు. దీంతో నిర్మాణం నిలిచింది. దీంతో అక్కడిక్కడే తక్కువ మలుపులో మట్టిని తోలి ద్విచక్రవాహనాలు మాత్రమే వెళ్లేందుకు తాత్కాలిక ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఆ మూలమలుపులకు, వంతెన చివరి భాగాలకు రక్షణ గోడలు లేవు. ఇనుప చు వ్వలు బయటకు కనిపిస్తూ ప్రమాదకరంగా ఉన్నాయి. కానీ తప్పనిసరి పరిస్థితులలో ద్వి చక్ర వాహనదారులు మాత్రం వంతెనపై అ లానే ప్రయాణిస్తున్నారు. ట్రాక్టర్లు, కార్లు, లా రీలు, ఆటోలు మాత్రం పాడుపడిపోయిన పా త చప్టాపైనే వెళుతున్నాయి. నేలచప్టానే ఉం డటంతో వర్షాకాలంలో సాగర్‌ కాలువకు నీరువిడుదలైనపుడు గుండ్లకమ్మ ఉధృతంగా ప్ర వహించి చప్టాపై నుంచి నీరు పారుతుంది. దీ నికితోడు పెద్దపెద్ద గుంతలు ఏర్పడి వాహనాలు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వం తెన పనులు మొత్తం పూర్తయితే ఎర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల వారికి ప్రయాణ ఇబ్బందులు తొలగుతాయి. త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం మండలాల్లోని వారు కురిచేడు, దొనకొండ, దర్శి, ముండ్లమూరు, ఒంగోలు ప్రాంతాలకు వె ళ్లేందుకు, ఒంగోలు, దర్శి, పొదిలి ప్రాంతాలవారు హైదరాబాద్‌ వెళ్లేందుకు సుమారు 50 కిలో మీటర్ల దూరం తగ్గుతుంది. దీనికి తోడు చందవరం వద్ద ప్రముఖ బౌద్ధక్షేత్రం, దొనకొండ వద్ద విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేయనున్నందున ఈ వంతెన నిర్మాణం ఎంతో అవసరం.  

బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి 

వంతెన వద్ద ఇరువైపులా రోడ్డును త్వరగా పూర్తి చేయాలి. గుండ్లకమ్మ నదిపై ని ర్మించిన వంతెన ద్వారా ఒంగోలు, దర్శి, కురిచేడు, దొనకొండ ప్రాంతాలకు త్వరగా వెళ్ల వచ్చు. సంబంధిత రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి రోడ్డును ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగం.                                - బి.వెంగళరెడ్డి, వెల్లంపల్లి





Updated Date - 2022-01-24T04:03:53+05:30 IST