Abn logo
Aug 4 2020 @ 05:19AM

ఉన్నవారిపైనే భారం

వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఉద్యోగులు, వైద్యులపై పెరిగిన ఒత్తిడి

ఉన్న సిబ్బందితోనే మెరుగైన వైద్య సేవలకు కృషి


నిజామాబాద్‌, ఆగస్టు 3 (ఆంద్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా తీవ్రత మొదలయినప్పటి నుంచి వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులకు తీరిక లేదు. సెలవులు లేవు. ఆశా వర్కర్‌ నుంచి వైద్యుల వరకు తీరిక లేకుండా విధులకు హాజరు అవుతున్నారు. తమ సేవలను కోవిడ్‌ వచ్చి న వారికి అందిస్తున్నారు. ఏళ్ల తరబడి శాఖతో పాటు వైద్య కళాశాల ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్న వారి పైననే ఒత్తిడి పెరుగుతోంది. జనరల్‌ ఆసుపత్రిలో ఉన్న వైద్యులతో పాటు జూ నియర్‌లు, సీనియర్‌ రెసిడెంట్ల, పీజీ స్టూడెంట్లు, హౌస్‌ సర్జన్‌ల పైననే  ఎక్కువ భారం పడుతోంది. పర్మినెంటు స్టాఫ్‌ మొత్తం భర్తీ కాకపో వడం వల్ల కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా పారామెడికల్‌ ఇతర సి బ్బందిని నియమించి సేవలు అందిస్తున్నారు. జిల్లాలో గడిచిన నెలలో కరోనా కేసులు భారీగా నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య 1350కి పై గా పెరిగాయి.


ఒక్క నిజామాబాద్‌ లోనే 750కి పైగా కేసులు నమోదు అయ్యాయి, రోజురోజుకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. ఎక్కువ మందికి సోకుతుంది. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో కరోనా ప్రభావం ఉంది. కేసుల సంఖ్య పెరుగుతుండంతో ఆసుపత్రులలో చేరే వారి సం ఖ్య పెరుగుతుంది. వీరితో పాటు హోంక్వారెంటైన్‌లో ఎక్కువ మంది ఉంటున్నారు. ప్రతి రోజూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో వైద్య, ఆ రోగ్యశాఖ ఉద్యోగులకు పని కూడా పెరుగుతోంది. ఉన్న సిబ్బంది రౌండ్‌ ది క్లాక్‌ పనిచేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో 32 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటి పరిధిలో వైద్యులతో పాటు సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారు.


ఏళ్ల తరబడి ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఈ కరోనా సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ ఆసుపత్రుల పరిధిలో 45 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 12 ఖాళీలు ఉన్నాయి. వీటితో పారా మెడికల్‌ సిబ్బంది అయిన నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఇతర సిబ్బంది లేరు. ప్రభుత్వంకు విన్నవించిన ఖాళీలు భర్తీ కాలేదు. కరోనా మొదలయినప్పటి నుంచి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన గ్రామాల్లో వారి ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టులను గుర్తించడంతో పాటు హోంక్వారంటైన్‌ ఉన్న వారికి చికిత్స అంది స్తున్నారు. కొన్ని రోజులుగా అన్ని పీహెచ్‌సీల పరిధిలో కరోనా ర్యాపిడ్‌ టెస్టులను చేస్తున్నా రు. శాఖకు చెందిన అందరూ కరోనా చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంత మంది వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. సిబ్బంది ఖాళీలు ఉండడం వల్ల కొన్ని సమయాల్లో ఇబ్బందులు ఎదుర వుతున్నాయి. ఎక్కువ మంది వచ్చినప్పుడు సిబ్బంది అందు బాటులో లేక సమస్యలు వస్తున్నాయి. 


అందరికీ జిల్లా జనరల్‌ ఆసుపత్రే దిక్కు...

ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రినే అందరినీ ఆదుకుంటోంది. జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఏర్పాటు చేసి 8 ఏళ్లు అవుతున్నా పూర్తి స్థాయి స్టాఫ్‌ను భర్తీ చేయ లేదు. కొంత మంది రెగ్యూలర్‌ ఉండగా మరికొంత మంది డిప్యూటేషన్‌ ఇతరులు కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో మొత్తం వైద్యులు 224 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం అన్ని కలిసి 133 మంది పనిచేస్తున్నారు. వీరిలో ప్రొఫెసర్లు 30 మంది ఉండాల్సి ఉండగా కేవలం 13 మంది మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి పారామెడికల్‌ సిబ్బంది నర్సింగ్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, పార్మసిస్ట్‌, ఇతర పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి. వీటిలో అత్యవసరం కింద ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో కొన్ని పోస్టులను గతంలో భర్తీ చేశారు. వీరితో పాటు పీజీ హౌస్‌ సర్జన్స్‌, జూనియర్‌, సీనియర్‌ రెసిడెంట్స్‌ ఉన్నారు. ఉన్న వారితో ఆసుపత్రిలో మెరుగైన సేవలకు ప్రయత్నం చేస్తున్న పెరుగుతున్న కరోనా కేసులతో సమస్యలు వస్తున్నాయి. ఆసుపత్రికి జనరల్‌ రోగులు కూడా ఎక్కువగా వస్తుండటంతో సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. 


కరోనాకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో ఎక్కువ మందిని వార్డులకు నియమించి సేవలు అంది స్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం కరోనా కోసం యుద్ధ ప్రాతి పదికన సౌకర్యాలు కల్పించినట్లే ఖాళీలను కూడా భర్తీ చేస్తే మరిం త మెరుగైన సేవలు అందనున్నాయి. జిల్లాలో ఉన్న సిబ్బందితోనే వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆ శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. అవసరం మేరకు కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమిస్తున్నట్లు తెలిపారు. జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో ఉన్న వారితో మెరుగైన సేవలు అందే విధంగా చూస్తున్నామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ తెలిపారు. కొత్త వారిని కూడా నియామకం చేస్తున్నట్లు తెలిపారు. కరోనాతో పాటు సాధారణ సేవలకు ఇబ్బందులు రాకుండా చూస్తు న్నామని తెలిపారు.

Advertisement
Advertisement