ఉప ఎన్నికలను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-10-17T04:50:25+05:30 IST

బద్వే లు నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి ముం దస్తు ప్రణాళికలతో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి ఎన్నికలను విజయవంతం చే యాలని బద్వేలు ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికా రి, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ అధికారులకు సూచించారు.

ఉప ఎన్నికలను విజయవంతం చేయాలి
అధికారుల సమావేశంలో ప్రసంగిస్తున్న ఎన్నికల అధికారి

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేతన్‌గార్గ్‌

బద్వేలు,అక్టోబరు 16: బద్వే లు నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి ముం దస్తు ప్రణాళికలతో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి ఎన్నికలను విజయవంతం చే యాలని బద్వేలు  ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికా రి, రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ అధికారులకు సూచించారు. శనివారం తహసీల్దారు కార్యాలయంలో ఉప ఎన్నికల ఏర్పాట్లపై సెక్టార్‌, రూట్‌ అధికారుల  సమీక్షలో ఆయన మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికలతో బద్వేలు ఉప ఎన్నికల ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పిచాలని, షెడ్డు లేనిపక్షంలో షామియానా ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సెక్ట ర్‌ రోల్‌ అధికారులు  పూర్తి బాధ్యత వహించాలన్నారు. సంబంధిత తహసీల్దారు, సెక్టార్‌ రోల్‌ ఆఫీసర్స్‌, రూట్‌ ఆఫీసర్స్‌ స్థానికులతో సమన్వయం చేసుకుని పనులు పూర్తిచేయాలన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ఈ వీఎంలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని డిస్ర్టిబ్యూషన్‌ కేంద్రం నుంచి పోలింగ్‌ కేంద్రం వరకు ఎలాంటి సమస్యలు లేకుండా తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

17వ తేదీ ఆదివా రం కడప ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో  ఉప ఎన్నికల ఏర్పాట్లపై శిక్షణ ఉంటుందన్నారు. 19న బద్వేలు జడ్పీహైస్కూల్‌లో ఈవీఎంలపై  శిక్షణ, 22వ తేదీ వరకు గురుకుల పాఠశాలలో ఈవీఎంపై శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో  ఉప ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసులరెడ్డి, ఆయా సెక్టర్‌ రోల్‌ అధికారులు, రూట్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T04:50:25+05:30 IST