Abn logo
Sep 25 2021 @ 00:25AM

ప్రజాసంగ్రామ యాత్రను విజయవంతం చేయాలి

చిగురుమామిడి లో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అద్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి...

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి

చిగురుమామిడి,సెప్టెంబరు 24: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో బీజేపీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు దుడ్డెల లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 29న చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామానికి రాత్రి ప్రజా సంగ్రామ యాత్ర చేరుకుంటుందన్నారు. తెల్లవారి ఇదే మండ లంలోని బొమ్మనపల్లి, సుందరగిరి గ్రామాల మీదుగా హుజూరాబాద్‌కు యాత్ర సాగుతుందన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర మండలానికి వస్తున్న సందర్భంగా  భారీగా కార్యకర్తలు, మహిళలు తరలివచ్చి ఘణస్వాగతం పలుకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్‌ నియెజకవర్గ ఇన్‌చార్జి చాడ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్‌, కళ్లెం వాసుదేవరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దురిశెట్టి సంపత్‌, యాత్ర రూట్‌ ప్రముఖ్‌ మాడ వెంకటరెడ్డి తదితరలు పాల్గొన్నారు.