Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఊరుకాని ఊరిలో..

చీపుర్లుపాడు వద్ద లారీని ఢీకొన్న కారు

ఒకరి దుర్మరణం, ఇద్దరి పరిస్థితి విషమం

బాధితులు ఒడిశా వాసులు

కోటబొమ్మాళి, డిసెంబరు 6: ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు ఒడిశాలోని భువనేశ్వర్‌ వాసులు. స్థానిక పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. భువనేశ్వర్‌కు చెందిన సురేష్‌ సమాల్‌ దమన్‌జోడిలోని నెల్కో కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి కారులో భువనేశ్వర్‌ వెళ్లారు. సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. చీపుర్లుపాడు సమీపంలో రోడ్డు పక్కన ఉన్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో సురేష్‌ సమాల్‌ భార్య తృప్తి సమాల్‌ (57) దుర్మరణం పాలయ్యారు. సమీప బంధువులు ప్రసన్నకుమార్‌ సమాల్‌, విజయలక్ష్మి బిస్వాల్‌లు తీవ్రంగా గాయపడ్డారు. సురేష్‌ సమాల్‌, కుమార్తె సంస్కృతి సమాల్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారమందుకున్న స్థానిక ఎస్‌ఐ వై.రవికుమార్‌ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. 

Advertisement
Advertisement