Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jun 3 2021 @ 03:46AM

బాబా రామ్‌దేవ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయండి

  • బిహార్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు


ముజఫర్‌పూర్‌, జూన్‌ 2: అల్లోపతి వైద్యం, డాక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగా గురు బాబా రామ్‌దేవ్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన గ్యాన్‌ ప్రకాశ్‌ అనే వ్యక్తి దావా వేశారు. ముజఫర్‌పూర్‌ చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో తన న్యాయవాది సుధీర్‌కుమార్‌ ఓఝా ద్వారా ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. అల్లోపతి వైద్యాన్ని, డాక్టర్లను అవమానిస్తూ బాబా రామ్‌దేవ్‌ వ్యాఖ్యలు చేశారని, భారతీయ శిక్షాస్మృతితో పాటు విప త్తు నిర్వహణ చట్టం కింద కూడా ఆయనపై దేశద్రోహ కేసు నమోదు చేయాలని తన వ్యాజ్యంలో కోరారు. 

Advertisement
Advertisement