భలే పిల్లి బొమ్మలు!

ABN , First Publish Date - 2020-10-24T06:38:09+05:30 IST

పార్కుల్లో గుబురుగా పెరిగే పొదలను అందమైన కళాకృతులుగా మార్చడం మీరు చూసే ఉంటారు. అలాంటివే ఈ పిల్లి బొమ్మలు కూడా. అయితే ఇవి మీకు ఎక్కడా పార్కుల్లో కనిపించవు...

భలే పిల్లి బొమ్మలు!

పార్కుల్లో గుబురుగా పెరిగే పొదలను అందమైన కళాకృతులుగా మార్చడం మీరు చూసే ఉంటారు. అలాంటివే ఈ పిల్లి బొమ్మలు కూడా. అయితే ఇవి మీకు ఎక్కడా పార్కుల్లో కనిపించవు. ఎందుకంటే అవి కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లో రూపొందించినది. 


  1. ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్‌ సాండర్స్‌ అనే కళాకారుడి ఇంట్లో పిల్లి ఉండేది. ఆయన ఎంతో ఇష్టంగా దాన్ని పెంచుకున్నాడు. ఒకరోజు అది చనిపోయింది. తరువాత దాని జ్ఞాపకార్థం ఆయన ఇలా పొదలను పిల్లిగా తీర్చిదిద్దడం మొదలుపెట్టాడు. వాటిని చూసిన వారు నిజంగా పొదలను పిల్లిగా మలిచాడని అనుకుంటారు.
  2. పిల్లితో మాట్లాడుతున్నట్టుగా, పిల్లి నీళ్లు తాగుతున్నట్టుగా, నిద్రపోతున్నట్టుగా.... ఇలా రకరకాల రూపాల్లో పిల్లి బొమ్మలు రూపొందించాడు. 
  3. అలా కంప్యూటర్‌లో రూపొందించిన పిల్లి బొమ్మలను సోషల్‌ మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌ అయ్యాయి. ఫేస్‌బుక్‌లో పెట్టడంతో కొన్ని లక్షల మంది వీక్షించారు. రిచర్డ్‌ పనితీరును చూసి అందరూ అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

Updated Date - 2020-10-24T06:38:09+05:30 IST