ఖర్చులో తేడా చేస్తే కేంద్రం నిధులివ్వదు

ABN , First Publish Date - 2020-02-14T10:18:59+05:30 IST

కేంద్ర ప్రభుత్వ పథకం కింద వచ్చేనిధుల వినియోగం విషయంలో తీసుకునే ఏ నిర్ణయమైనా కేంద్రం అనుమతితోనే జరగాలని..

ఖర్చులో తేడా చేస్తే కేంద్రం నిధులివ్వదు

గతంలో తప్పు జరిగింది.. సరిచేస్తున్నాం

‘ఆంధ్రజ్యోతి’ వార్తకు కృతికా శుక్లా వివరణ 


అమరావతి, ఫిబ్రవరి13(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పథకం కింద వచ్చేనిధుల వినియోగం విషయంలో తీసుకునే ఏ నిర్ణయమైనా కేంద్రం అనుమతితోనే జరగాలని.. లేనిపక్షంలో భవిష్యత్తులో నిధుల మంజూరుకు ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని స్ర్తీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ గురువారం సంచికలో ‘జీతాల పెంపులోనూ రివర్స్‌’ అనే వార్తకు ఆమె వివరణ ఇచ్చారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులు దుర్వినియోగం కాకుండా బాధ్యతతో ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామన్నారు. ఈ క్రమంలో గతంలో జరిగిన కొన్ని పొరపాట్లను సరిచేయాలని నిర్ణయించామని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు నిబంధనలకు విరుద్ధంగా మినిమం టైమ్‌ స్కేల్‌ అమలు చేస్తున్న విషయాన్ని గుర్తించి దానిని సరిదిద్దుతూ తాజా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఈ కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో నిబంధలకు భిన్నంగా వ్యవహారం సాగిందని జీవో 24ను అనుసరించి ఆర్థికపరమైన అనుమతులు లేకుండా మినిమం టైమ్‌ స్కేలు అమలు చేశారని వివరించారు. బాలల సంరక్షణ విభాగం జువనైల్‌ జస్టిస్‌ బోర్డుల పరిధిలో పనిచేయాల్సిన ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా స్త్రీ, శిశు సంక్షేమశాఖలో ఉన్నట్లు గుర్తించామన్నారు. 

Updated Date - 2020-02-14T10:18:59+05:30 IST