కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఇక్కట్లు

ABN , First Publish Date - 2021-11-28T06:43:58+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు ఇక్కట్లు పాలవుతున్నారని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు ఆరోపించారు

కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఇక్కట్లు
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న వరసాల శ్రీనివాసరావు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ  నాయకుడు వరసాల శ్రీనివాసరావు

కూర్మన్నపాలెం, నవంబరు 27: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు ఇక్కట్లు పాలవుతున్నారని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ  నాయకుడు వరసాల శ్రీనివాసరావు ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 289వ రోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో ట్రాఫిక్‌ విభాగం కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే నెల ఎనిమిదవ తేదీకి దీక్షలు 300 రోజులు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ఉపాధి కల్పించే ప్రభుత్వరంగ సంస్థల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం తగదన్నారు. ఈ శిబిరంలో పరిరక్షణ పోరాట కమిటీ నేతలు గంధం వెంకటరావు, జి.ఆనంద్‌, త్రిమూర్తులు, గోవిందరావు, భాస్కర్‌, రామన్న, రామారావు, ఎల్లయ్య, సాయి, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, జెర్రిపోతుల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-11-28T06:43:58+05:30 IST