కేంద్రమే తెలంగాణకు బాకీ

ABN , First Publish Date - 2020-11-28T08:46:02+05:30 IST

టోల్‌గేట్‌ సహా తెలంగాణ నుంచి రూ. 3 లక్షల కోట్లు పన్నుల రూపంలో తీసుకెళ్లిన కేంద్రం... అందులో 30

కేంద్రమే తెలంగాణకు బాకీ

 తీసుకున్న దాంట్లో 30 ు కూడా తిరిగివ్వలేదు

 నామా నాగేశ్వర్‌రావు

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): టోల్‌గేట్‌ సహా తెలంగాణ నుంచి రూ. 3 లక్షల కోట్లు పన్నుల రూపంలో తీసుకెళ్లిన కేంద్రం... అందులో 30 శాతం కూడా తిరిగివ్వలేదని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు అన్నారు. కేంద్రమే తెలంగాణకు బాకీ ఉంది తప్ప ఇచ్చిందేమీ లేదన్నారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టునూ తేని బీజేపీ.. కనీసం నవోదయా స్కూల్‌నూ తేలేక పోయిందని ఎద్దేవా చేశారు.


తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో నామా మాట్లాడారు.  తెలగాణ నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు, రాష్ట్ర హక్కుల గురించి పార్లమెంటులో ఒక్క ముక్కయినా మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి వస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు చేసిందేమిటో లెక్కలు చెప్పి ఓట్లడగాలన్నారు. గుజరాత్‌, కర్ణాటకలకు వరదసాయం చేసిన కేంద్రం.. తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు. రాష్ట్రానికి న్యా యంగా రావాల్సిన నిధులనూ ఇవ్వట్లేదన్నారు.


కొవిడ్‌ వ్యాక్సిన్‌ హైదరాబాద్‌లో తయారవడం గర్వకారణమన్నారు. ఎన్నికల స్టంట్‌ కోసం తెలంగాణ కు వ్యాక్సిన్‌ ఫ్రీగా ఇస్తామంటూ శనివారం హైదరాబాద్‌ కేంద్రంగా మోదీ ప్రకటిస్తారేమోనని పేర్కొన్నారు. బిహార్‌ ఎన్నికలప్పుడూ అక్కడ టీకా ఉచితంగా ఇస్తామ ని బీజేపీ చెప్పిందన్నారు. ఢిల్లీ మెట్రోలో ఉచిత ప్రయా ణం అని ఆప్‌ ప్రభుత్వం ప్రకటిస్తే వ్యతిరేకించిన బీజేపీ నేతలు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత ప్రయాణమని పేర్కొనడం ఏమిటని ప్రశ్నించారు.  


Updated Date - 2020-11-28T08:46:02+05:30 IST