Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని దగా చేస్తున్నాయి

 విశ్వసనీయత లేకనే క్యాంపు రాజకీయాలు

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, డిసెంబరు 5 : సకాలంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయక, పంటలకు మద్దతు ధరలు కల్పిం చక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని దగా చేస్తున్నా యని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల అర్బన్‌, రూరల్‌ మండ లాల కాంగ్రెస్‌ కార్యకర్తల విసృత స్థాయి సమావేశాన్ని స్థానిక దే విశ్రీ గార్డెన్‌లో నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి హాజరై కాం గ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మా ట్లాడుతూ మోదీఆలోచన విధానాలను రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ తూచా తప్పకుండా పాటిస్తూ కేంద్రానికి తోక పార్టిగా టీఆర్‌ ఎస్‌ ను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి స్వంత ఓటర్లపై అనుమానంతో పాటు విశ్వనీయత లేకనే క్యాంపు రాజ కీయాలకు తెరలేపారని ఆరోపించారు. కమిషన్ల కక్కుర్తి కోసమే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను ఇస్తున్నారని, రైతులకు 9 గంటల కరెంట్‌ ఇస్తే సరిపోతుందని, విద్యుత్‌ భారం పేరుతో గృ హ వినియోగదారులపై విద్యుత్‌ బిల్లులు భారం పెంచితే ప్రభు త్వానికి తుది గడియలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తి గా విఫలమైందని, తక్షణమే బి స్వాల్‌ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పింఛను వయసును 57 సంవ త్సరాలకే కుదించిన ప్రభుత్వం గత మూడెళ్లలో ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదని తక్షణమే అర్హులైన వారికి మూ డేళ్ల ఏరియర్స్‌ ఇచ్చి పింఛను మంజూరు చేసి ప్రభుత్వం తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, అ ర్బన్‌, రూరల్‌ మండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్‌, జున్ను రాజేందర్‌, నాయకులు బొడ్డు లక్ష్మణ్‌, ధర ర మేష్‌ బాబు, శ్రీనివాస్‌రెడ్డి, నారాయణరెడ్డి, లక్ష్మణ్‌, అంకతి గం గాధర్‌, ధామోదర్‌రెడ్డి, మొగిలి, రవీందర్‌రెడ్డి, మధు, శ్రీనివాస్‌, రాము, దేవేందర్‌రెడ్డి, బాపురెడ్డి, రాధకిషన్‌రావు, శేఖర్‌, గంగారెడ్డి ఉన్నారు.

Advertisement
Advertisement