కార్పొరేట్‌ శక్తుల కీలుబొమ్మగా కేంద్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-29T06:03:29+05:30 IST

కార్పొరేట్‌ శక్తుల కీలుబొమ్మగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు ఆరోపించారు

కార్పొరేట్‌ శక్తుల కీలుబొమ్మగా కేంద్ర ప్రభుత్వం
రిలే నిరాహార దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న ఎన్‌.రామారావు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు

కూర్మన్నపాలెం, జనవరి 28: కార్పొరేట్‌ శక్తుల కీలుబొమ్మగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిరసనగా ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 351వ రోజు కొనసాగాయి.  శుక్రవారం ఈ దీక్షలో ఎల్‌ఎంఎంఎం, డబ్ల్యూఆర్‌ఎం, ఆర్‌ఎస్‌అండ్‌ఆర్‌ఎస్‌ విభాగ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో రామారావు మాట్లాడుతూ పిబ్రవరి 23, 24 దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్గారు. పోరాట కమిటీ నాయకులు గంధం వెంకటరావు,  వరసాల శ్రీనివాసరావు, కేఎస్‌ఎన్‌ రావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, జి.ఆనంద్‌, నాగబాబు, త్రినాథ్‌, హరిబాబు, జె.ముత్యాలు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-29T06:03:29+05:30 IST