Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేంద్ర ప్రభుత్వం ఓబీసీల కుల గణన చేపట్టాలి

సూర్యాపేటటౌన్‌, డిసెంబరు 2 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ కుల గణన, జనగణన చేపట్టాలని డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ఓబీసీ తండు శ్రీనివాస్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ కళాశాలలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగే బీసీల ఛలో ఢిల్లీ కరపత్రాలను గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. మండలి కమిషన్‌ సిఫారసులను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి బెంజారపు రమేష్‌గౌడ్‌, బీసీ సంక్షేమ సంఘం నాయకులు వూర రాంమూర్తియాదవ్‌, వీరబోయిన లింగయ్య, గుండాల సందీప్‌, బొడ్డు కిరణ్‌,  అశోక్‌, ఉపేందర్‌, మహేష్‌, అశోక్‌ పాల్గొన్నారు.  

బీసీ సంఘం ఆధ్వర్యంలో

జిల్లా కేంద్రంలోని జ్యోతిరావుపూలె విగ్రహం వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల నర్సింహ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు మారపాక వెంకన్న, భూపతి నారాయణగౌడ్‌, రమేష్‌యాదవ్‌, సంపత్‌నాయుడు, కోడి లింగయ్య, అక్కినపెల్లి శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, వెంకన్న, రవిగౌడ్‌, మొదాల విజయ్‌, కృష్ణ, కిషోర్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement