Abn logo
Jan 16 2021 @ 23:54PM

కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలి

బీర్కూర్‌లో తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న మదన్‌ మోహన్‌రావు

బీర్కూర్‌/నస్రుల్లాబాద్‌, జనవరి 16: కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు చట్టాలను రద్దు చేయాలని టీ పీసీసీ ఐటీ సెల్‌ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీ మదన్‌ మోహ న్‌రావు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన బాన్సువాడ నియోజకవ ర్గ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి నస్రుల్లాబాద్‌, బీర్కూర్‌ మండలాల్లో పర్యటించారు. కాన్వాయ్‌తో ఆయన దామరంచకు చేరు కుని కాంగ్రెస్‌ శ్రేణులతో బీర్కూర్‌కు చేరుకుని, తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డీ విరి చేలా రైతు చట్టాలను రూపొందించిందని విమర్శించారు. ఈ చట్టాల వల్ల రైతులు రోడ్డున పడ్డారన్నారు. రైతును రాజు చేస్తామని గొప్పలు చెప్పే ప్రధాని నరేంద్రమోదీ, రైతులను నట్టేట ముంచే చట్టాలను తీసుకుని వచ్చారని ఆరోపించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమ ంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోదని, ధాన్యం కొనుగోళ్లను చేపట్టదని చెబుతున్నారని విమర్శిం చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిండా ముంచుతున్నాయ న్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవా లని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. అనంతరం తహసీల్దార్‌ గణేష్‌కు మదన్‌మోహన్‌ రావు కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి వినతిపత్రా న్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నందురెడ్డి, సాయిలు, శంకర్‌ నాయక్‌, శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement