కేంద్ర ప్రభుత్వం కుట్రలను అడ్డుకోవాలి

ABN , First Publish Date - 2020-05-08T07:40:09+05:30 IST

ప్రజలకు అందిస్తున్న విద్యుత్‌ సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్రలు ప న్నుతుందని దీనిని రాజకీయాలకు

కేంద్ర ప్రభుత్వం కుట్రలను అడ్డుకోవాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, మే 7 : ప్రజలకు అందిస్తున్న విద్యుత్‌ సబ్సిడీలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్రలు ప న్నుతుందని దీనిని రాజకీయాలకు అతీ తంగా విద్యుత్‌ వినియోగదారులు నిరస నలతో అడ్డుకోవాలని సెస్‌ చైర్మన్‌ దోర్నా ల లక్ష్మారెడ్డి కోరారు. సిరిసిల్ల సెస్‌ ప్రధా న కార్యాలయంలో గురువారం పాలకవ ర్గ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశా రు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంస్థ పరిఽధిలో వ్యవసాయానికి  24గం టల ఉచిత విద్యుత్‌ను అందిస్తుండగా, మరమగ్గాల పరిశ్రమలకు 50 శాతం స బ్సిడీతో అందిస్తున్నామని వీటిని క్రమబ ద్ధీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ చట్టాన్ని ఏప్రిల్‌ 17వ తేదీన విడుదల చేసి రాష్ట్రాలకు పరిశీలనలకు పంపించిందని అన్నారు. దీనిని అమలు చేస్తే సబ్సిడీ రద్దు కావడంతో పాటు వ్య వసాయ విద్యుత్‌కు బిల్లు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ని ర్ణయాన్ని  వినియోగదారులు నిరసనల తో వ్యతిరేకించాలని కోరారు. 

Updated Date - 2020-05-08T07:40:09+05:30 IST