Abn logo
Oct 24 2020 @ 06:17AM

వచ్చే నెల 3 నుంచి సదరం సర్టిఫికెట్లు జారీ

ఏలూరు క్రైం, అక్టోబరు 23 : దివ్యాంగుల అంగవైకల్య నిర్ధారణ శాతాన్ని గుర్తించి జారీ చేసే సదరం సర్టిఫికెట్లను నవంబర్‌ మూడు నుంచి తిరిగి జారీ చేయనున్నట్లు జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహ న్‌ చెప్పారు. ప్రతి సోమవారం కొవ్వూరు, భీమవరం, ఆకివీడు, గోపాలపురం ప్రభుత్వాసుప త్రుల్లోను,  ప్రతీ మంగళవారం తణుకు, తాడేపల్లి గూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెంలోను, ప్రతీ బుధవారం నిడదవోలు, భీమడోలు, దెందులూరు, పాలకొల్లు, పోలవరంల్లోను, ప్రతీ గురువారం ఆచంట, నరసాపురం ప్రభుత్వాసుపత్రుల్లోను మెడికల్‌ బోర్డును నిర్వహిస్తారు. సదరం సర్టిఫి కెట్‌ పొందగోరే దివ్యాంగులు ముందుగా గ్రామ సచివాలయం లేదా మీ సేవ కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ చేసుకుని, వారికి కేటాయిచిన తేదీల్లో సం బంధిత ఆసుపత్రులకు హాజరై అంగవైకల్య నిర్ధారణ (సదరం) సర్టిఫికెట్‌ను పొందవచ్చునని ఆయన సూచించారు. 

Advertisement
Advertisement