ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్ష చేయాలి

ABN , First Publish Date - 2021-12-01T09:30:53+05:30 IST

సీఎం కేసీఆర్‌ అయినా ధాన్యం కొనుగోలులో న్యాయం చేస్తారని తెలంగాణ సమాజం ఆశించిందని, కేంద్రం విఫలమైనప్పుడు కనీసం కేసీఆర్‌ అయినా రైతులను ఆదుకోకపోవడం బాధాకరమని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్ష చేయాలి

  • సీఎం కేసీఆర్‌ చచ్చుడో వరి కొనుడో తేలాలి
  • కేంద్రం కొనకపోతే కేసీఆర్‌ అయినా ఆదుకోవాలి కదా!
  • రైతులను మోసగిస్తున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ: రేవంత్‌


న్యూఢిల్లీ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ అయినా ధాన్యం కొనుగోలులో న్యాయం చేస్తారని తెలంగాణ సమాజం ఆశించిందని, కేంద్రం విఫలమైనప్పుడు కనీసం కేసీఆర్‌ అయినా రైతులను ఆదుకోకపోవడం బాధాకరమని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి  అన్నారు. కేసీఆర్‌ ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ చచ్చుడో.. వరి కొనుడో తేలాలన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. వరి పండించిన రైతులు పంట అమ్ముకోలేక ప్రాణాలు వదులుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ కలిసి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందంలో భాగంగా రైతు చట్టాల రద్దుపై చర్చ జరగకుండా టీఆర్‌ఎస్‌ ఎంపీలు లోక్‌సభను అడ్డుకున్నారని ఆరోపించారు. 


తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని ప్రకటించలేదని, పత్తికి సరైన మద్దతు ధర రాక రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  వరి పండించిన రైతులకు కేసీఆర్‌ ఉరి వేస్తున్నారని, కనీసం పండ్ల రైతులకు కూడా తెలంగాణ నుంచి మద్దతు లేదని ఆరోపించారు.కేంద్రం కేసీఆర్‌ మెడపై కత్తి పెడితే ఆస్తులు, పదవులు మోదీకి రాసిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంలో జరిగినఅవినీతిపై దర్యాప్తు జరిపిస్తామని కేంద్రం చెప్పినందుకే కేసీఆర్‌ రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారా అని నిలదీశారు. తెలంగాణలో ఇప్పటి వరకు 20ు పంట మా త్రమే కొనుగోలు చేశారని, ఇంకా 80ు అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ సుదీర్ఘ పోరాటం చేస్తుందని ఆయన ప్రకటించారు. 

Updated Date - 2021-12-01T09:30:53+05:30 IST