Advertisement
Advertisement
Abn logo
Advertisement

Viral Video: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన చిన్నారి.. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. ఏం చేశాడంటే..

ఆస్పత్రికి వెళ్తున్నామంటేనే పిల్లలకు నచ్చదు. లోపలికి వెళ్లగానే ఏడుపు మొదలెడతారు. బయటికొచ్చేంతవరకూ ఒక పట్టాన ఉండరు. ఇంజక్షన్ చేస్తే.. ఇక వారి పరిస్థితి చెప్పనక్కరలేదు. అంతెందుకు.. చాలా మంది పెద్దవారికి కూడా ఆస్పత్రుల్లో ఉండాలంటే ఇష్టముండదు. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా.. అని అనుకుంటూ ఉంటారు. కానీ ఓ బుడ్డోడిని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన చిన్నారి.. లోపల ఏం చేశాడో తెలుసా.. 


బ్రెజిల్‌కు చెందిన మిగ్యుల్ అనే ఓ చిన్నారి.. గ్యాస్ట్రోఎంటెరిటిస్‌ సమస్యతో గత వారం ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు చికిత్స చేస్తున్నా ఏమాత్రం భయపడలేదు. బెడ్ మీద ఉన్న సమయంలో టీవీలో తనకు ఇష్టమైన పాట వచ్చింది. అందులో ఓ యువతి మైక్‌ పట్టుకుని పాట పాడుతూ ఉంది. ఇంకేముంది.. అది చూసిన బుడ్డోడికి ఉత్సాహం వచ్చింది. వెంటనే పక్కనే ఉన్న ఒక చెంచాను మైకులా భావించాడు. దాన్ని తీసుకుని అతను కూడా పాడుతూ, డ్యాన్స్ చేయడం మొదలెట్టాడు.


ఆస్పత్రిలో ఉన్నాననే ఆందోళన.. ఇసుమంత కూడా లేని ఆ చిన్నారిని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. పక్కనున్న వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. చిన్నారులకే కాదు.. పెద్దవారికి కూడా ఈ బుడతడు ఆదర్శంగా నిలుస్తున్నాడంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ చిన్నారి.. పలువురితో శభాష్ అనిపించుకుంటున్నాడు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement