Abn logo
Sep 21 2021 @ 01:15AM

సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలి

చౌటుప్పల్‌లో పూజల్లో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

చౌటుప్పల్‌ టౌన్‌, సెప్టెంబరు 20: సీఎం కేసీఆర్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలని వినాయకుడిని ప్రార్థించానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లోని పలు వినాయక మండపాల్లో  సోమవారం రాత్రి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తను ప్రతిపక్ష పార్టీ  ఎమ్మెల్యే అయినందునే మునుగోడు నియోజక అభివృద్ధికి  కేసీఆర్‌ ,కేటీఆర్‌లు వివక్ష చూపుతూ ఒక్క రూపాయి కూడా కేటాయిం చడంలేదని ఆయన విమర్శించారు. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.  రాజకీయ వివక్షను విడనాడి కేసీఆర్‌, కేటీఆర్‌లను మంచి బుద్ధిని  ప్రసాదించాలని గణనాథుడిని వేడుకున్నట్టు ఆయన తెలిపారు .ఈకార్యక్రమాల్లో  వైస్‌ ఎంపీపీ భద్రయ్య, వెంకటయ్య. శ్రీనాథ్‌, ఎం.రమేష్‌గౌడ్‌, కౌన్సిలర్‌ సైదులు పాల్గొన్నారు.