బీసీలను మరచిన సీఎం

ABN , First Publish Date - 2020-08-15T10:22:19+05:30 IST

బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ తమను విస్మరిస్తున్నారని బీసీ సంఘాల నాయ

బీసీలను మరచిన సీఎం

  ఏకమై హక్కులు సాధించుకుందాం

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 14: బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ తమను విస్మరిస్తున్నారని బీసీ సంఘాల నాయకులు విమర్శించారు. శుక్రవారం స్థానిక హెచ్చెల్సీ కాలనీలోని వీకే భవన్‌లో బీసీ సంక్షేమసంఘం సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ బీసీల వ్యతిరేకిగా సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని, బీసీలకు కేటాయించిన సబ్సిడీ రుణాలు రద్దు చేసి అన్యాయం చేశారన్నారు.


ప్రభుత్వం నుంచి దక్కాల్సిన హక్కులు, వాటా సాధనకై ఐక్యపోరాటాలు చేస్తామని తెలిపారు. బీసీ సంక్షేమసంఘం జిల్లా నూతన అధ్యక్షుడిుగా కిరణ్‌కుమార్‌గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా కార్యవర్గం రెండుమూడు రోజుల్లో ప్రకటిస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమసంఘం నాయకులు సుధాకర్‌యాదవ్‌, దేవళ్ల మురళీ, కుంచెం వెంకటేష్‌, నారాయణస్వామి యాదవ్‌, రాప్తాడు వెంకటరాముడు, వాల్మీకి అక్కులప్ప, గాండ్ల నాగరాజు, సగర గిరిబాబు, చేనేత నరసింహులు, ఈడిగ వెంకటే్‌షగౌడ్‌, రాజుగౌడ్‌, కురుబసంఘం బాబు, రాజశేఖర్‌, మణరవి, నాయీబ్రాహ్మణ సంఘం చరణ్‌, ఆదినారాయణ, బెస్త నారాయణస్వామి, ఏకుల చితంబరదొర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-15T10:22:19+05:30 IST