కళాశాల తరలింపును ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-04-05T07:12:12+05:30 IST

ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం మాకే కావాలంటూ గోదావరిఖనిలో సోమ వారం విద్యార్థులు కదంతొక్కారు. తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరిం చుకోవాలంటూ రోడ్డెక్కి నిరసన తెలిపారు

కళాశాల తరలింపును ఉపసంహరించుకోవాలి
ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు

- వేర్వేరుగా రాస్తారోకో చేసిన ఏబీవీపీ, ఏఐఎస్‌ఎఫ్‌ సంఘాలు 

కోల్‌సిటీటౌన్‌, ఏప్రిల్‌ 4: ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం మాకే కావాలంటూ గోదావరిఖనిలో సోమ వారం విద్యార్థులు కదంతొక్కారు. తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరిం చుకోవాలంటూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఏబీవీపీ, ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘాల వేర్వేరుగా రాజీవ్‌ రహదారిపై  రాస్తారోకో చేపట్టారు.  ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌ అంటూ విద్యార్థు లు నినాదాలు చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు ఊషణ అన్వేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీకళాశాల  ఎన్నో ఏళ్లుగా వేలాది మంది పేద, మధ్య తరగతి విద్యార్థు లకు ఉన్నత చదువు అందించిందన్నారు. అలాంటి కళాశాలను 150 మంది మెడికల్‌ కళాశాల కోసం వెయ్యిమంది ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని అప్పగించడం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు. కళాశాలను తరలించే నిర్ణయాన్ని ఉపసంహరించుకో వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ అజయ్‌, ఎస్‌ఎఫ్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ ప్రవీణ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణుభక్తుల రిషి, నగర ఇంచార్జీ పిడుగు సిద్ధార్థ, నాయకులు నితిన్‌, నాగచంద్ర, వసీం, నాగరాజు, అరవింద్‌, సంజయ్‌, శివ సందీప్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

- ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో..

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తరలించవద్దంటూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయకార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు కళాశాలను తరలించేందుకు ప్రయత్నాలు చేసినా అడ్డుకుంటామన్నారు. మెడికల్‌ కళాశాలపై చిత్తశుద్ది ఉంటే ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయాన్ని  ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు సాగర్‌, అనురాజ్‌, సాయి, శివాజీ, భార్గవ్‌, రాజ్‌కుమా ర్‌, మనీ, సాయిగణేష్‌, ఆకాష్‌, విష్ణుప్రియ, అంజలి  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-05T07:12:12+05:30 IST