Abn logo
Apr 9 2021 @ 01:34AM

రాబోయే వేసవి కాలంలో పశుగ్రాసం కొరత లేకుండా చూడాలి


పశువైద్య పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డ

నిర్మల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 8 : రాబోయే వేసవి కాలంలో పశుగ్రాసం కొరత లేకుం డా చూడాలని పశువైద్య పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ బి. లక్ష్మారెడ్డి అన్నారు. గురు వారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ నిర్దేశించిన లక్ష్యాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పశుగ్రాసం కొరత లేకుండా నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ ఈ కార్యక్రమాల్లో భాగంగా 25 మెట్రిక్‌ టన్నుల విత్తనాలను రైతులకు 75 శాతం పైన సరఫరా చేయడం జరిగింద న్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పశువుల పాకలు నిర్మించడానికి వచ్చేయాలని ఆదేశించారు. సంకరజాతి అభివృద్ధికి సిబ్బంది కృషి చేయాలని కోరారు. పశువులన్నింటిని ముందుగా గుర్తించి వ్యాధి నిరోధక టీకాలు ఏరా చూడాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ మాట్లాడుతూ జీవాల పెంపకం మూస పద్ధతిలో కాకుండా సాంకేతికను జోడించి ఆధునిక పద్ధతిలో ఒక గ్రామంలో చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పశువుల బోను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసే విధంగా గ్రామ పంచాయతీ ద్వారా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే జిల్లాలోని మూడు ఏరియా పశు వైద్యశాలలో అల్ర్టాసౌండ్‌ పరికరాలను ఏర్పాటు చేయుటకు కృషి చేస్తామని తెలిపారు.  డాక్టర్‌ వి.లక్ష్మారెడ్డిని కలెక్టర్‌ శాలువా, మెమెంటోతో సత్కరించారు. ఈ కార్య క్రమంలో జిల్లా పశువైద్యాధికారి రమేష్‌ కుమార్‌, ఏడీ డాక్టర్‌ సురేష్‌, డాక్టర్‌ మహేష్‌, సహయ సంచాలకులు, పశువైద్యులు, తదితరులు ఉన్నారు. 


Advertisement
Advertisement