న్యాయం కోసం ఇద్దరు మహిళల ఆందోళన

ABN , First Publish Date - 2021-05-06T05:10:07+05:30 IST

న్యాయం కోసం ఇద్దరు మహిళలు తమ భర్తల ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేసిన సంఘటన నాగర్‌కర్నూల్‌ మండలం తూడి కుర్తిలో బుధవారం చోటుచేసుకుంది.

న్యాయం కోసం ఇద్దరు మహిళల ఆందోళన
భర్తల ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న బాధిత మహిళలు

నాగర్‌కర్నూల్‌ క్రైం, మే 5: న్యాయం కోసం ఇద్దరు మహిళలు తమ భర్తల ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేసిన సంఘటన నాగర్‌కర్నూల్‌ మండలం తూడి కుర్తిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓంప్ర కాష్‌, జయంత్‌కుమార్‌ ఇద్దరు అన్నదమ్ములు. మధులత, భార్గవి అనే మహిళలను వివాహం చేసుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు  భార్యలను పట్టించకోకుండా వ్యవహరిస్తుండడంతో న్యాయం జరగాలంటూ తోడి కోడళ్లు  ఇద్దరు వారి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. అన్న ఓంప్రకాష్‌కు 12సంవత్సరాల క్రితం మధులతతో వివా హం కాగా ఒక కుమారుడు ఉన్నాడు. అలాగే తమ్ముడు జయంత్‌కుమార్‌కు 6ఏళ్ల క్రితం భర్గవితో వివాహం జరిగింది. ఏవేవో కారణాలతో ఇద్దరు తోడి కోడళ్లను అన్మద మ్ములు ఇంటికి రానివ్వకుండా వ్యవహరిస్తున్నారని బాధిత మహిళలు ఆందోళన వెలిబుచ్చారు. దీంతో చేసేదేమిలేక తమ భర్తల ఇంటి ముందు ఆందోళన చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని న్యాయ పోరాటానికి దిగామని పేర్కొన్నారు. ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో గమనించిన అన్నదమ్ములు పరారైనట్లు బాధిత మహిళలు తెలిపారు. దీంతో అక్కడ న్యాయం జరకపోవడంతో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని  బాధిత మహిళలు అన్నారు.  

Updated Date - 2021-05-06T05:10:07+05:30 IST