ఆ మహిళకు వింత వ్యాధి.. రోజూ 70సార్లు వాంతులు.. ప్రాణంతో ఉండాలంటే ఎంత ఖర్చవుతుందంటే..

ABN , First Publish Date - 2021-11-22T02:43:58+05:30 IST

ఇంగ్లండ్‌లో ఓ మహిళకు వింత వ్యాధి సోకింది. దీంతో 13 సంవత్సరాలుగా ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతోంది. రోజూ సుమారు 70 సార్లు వాంతులు అవుతాయట. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆమె ఏం చేస్తుందంటే..

ఆ మహిళకు వింత వ్యాధి.. రోజూ 70సార్లు వాంతులు.. ప్రాణంతో ఉండాలంటే ఎంత ఖర్చవుతుందంటే..
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం వింత వ్యాధి అంటేనే జనంలో వణుకు పుడుతోంది. అసలే కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎక్కడ ఏ వార్త విన్నా ఆందోళన మొదలవుతోంది. తగ్గే వ్యాధి అయితే పర్లేదు కానీ.. మందులు లేని వ్యాధి వస్తేనే ఇబ్బంది. ఇంగ్లండ్‌లో ఓ మహిళకు వింత వ్యాధి సోకింది. దీంతో 13 సంవత్సరాలుగా ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతోంది. రోజూ సుమారు 70 సార్లు వాంతులు అవుతాయట. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆమె ఏం చేస్తుందంటే.. 


ఇంగ్లండ్‌లోని బోల్టన్‌కు చెందిన లీన్నే విలన్ అనే 39 ఏళ్ల మహిళ 2008నుంచి గ్యాస్ట్రోపరేసిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీని కారణంగా ఆమెకు తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదట. రోజూ 70సార్లకు పైగా వాంతులు చేసుకుంటోంది. వైద్యులను సంప్రదించగా చికిత్స చేసి వ్యాధిని నిర్ధారించారు. శాశ్వత పరిష్కారం లేకపోవడంతో ఆమెకు గ్యాస్ట్రిక్‌ పేస్‌మేకర్‌ను అమర్చారు. అయితే బ్యాటరీలు లేకపోతే ఆమె పరిస్థితి విషమిస్తుంది. ఆ బ్యాటరీలు దొరకడం చాలా కష్టమట. వాటిని కొనాలంటే రూ.కోటికి పైగా ఖర్చవుతుందని చెబుతున్నారు.


ఇటీవల ఆ మహిళకు అమర్చిన పరికరం బ్యాటరీ పవర్ తగ్గడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందట. బ్యాటరీలు కొనే స్థోమత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కుటుంబ సభ్యులు, బంధువులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కొత్త బ్యాటరీలు కొనేందుకు ఇటీవల విరాళాలు సేకరించడం మొదలెట్టింది. ఇందుకోసం "గో ఫండ్‌ మీ" అనే వెబ్‌పేజీ ప్రారంభించింది. ఇప్పటి వరకు సుమారు రూ.3 లక్షల వరకు విరాళాలు వచ్చాయి. మరోవైపు ఆమె వ్యాధిని శాశ్వతంగా తగ్గించేందుకు వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారట.

Updated Date - 2021-11-22T02:43:58+05:30 IST