రానున్న ఎన్నికల్లో కాంగ్రె్‌సదే అధికారం

ABN , First Publish Date - 2022-01-22T05:57:23+05:30 IST

రానున్న ఎన్నికల్లో కేంద్రం, రాష్ర్టాల్లో కాంగ్రె్‌సదే అధికారమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

రానున్న ఎన్నికల్లో కాంగ్రె్‌సదే అధికారం
హుజూర్‌నగర్‌లో మాట్లాడుతున్న గీతారెడ్డి, చిత్రంలో ఎంపీ ఉత్తమ్‌ తదితరులు

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 


హుజూర్‌నగర్‌ , కోదాడ టౌన్‌, జనవరి 21: రానున్న ఎన్నికల్లో కేంద్రం, రాష్ర్టాల్లో కాంగ్రె్‌సదే అధికారమని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌, కోదాడలో కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదును ప్రారంభించి వారు మాట్లాడారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు కులాలు, మతాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అదాని, అంబానీలకు దేశాన్ని తాకట్టు పెట్టిందన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక ఏ వర్గం ఆనందంగా లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ అహంకార పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. వ్యవసాయ రంగాన్ని సీఎం నిర్వీర్యం చేశారని, తెలంగాణలో తుగ్లక్‌ పాలన చేస్తూ ఆంక్షలు విధిస్తున్నారన్నారు. 317 జీవోతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎంతోమంది చనిపోయారన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వారి తల్లిదండ్రుల ఉసురు కేసీఆర్‌కు తగులుతుందన్నారు. రైతుల చేత కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం మనుగడ కొనసాగించలేదని, టీఆర్‌ఎస్‌కు అదే గతి పడుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ మోసపూరిత హామీలు, మాయమాటలు ప్రజలు నమ్మేపరిస్థితి లేదన్నారు. ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ అని చెప్పిన టీఆర్‌ఎస్‌ ఏకకాలంలో రుణమాఫీ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. దళితులను సీఎం చేస్తానని చెప్పి, కనీసం మంత్రివర్గంలో చోటు కూడా ఇవ్వలేదని, సీఎం కేసీఆర్‌ సామాజిక న్యాయం ఏ విధంగా సాధిస్తారో చెప్పాలని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి, రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా, సాధారణ ఎన్నికలు జరిగినా తెలంగాణలో కాంగ్రెస్‌దే గెలుపు అన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని బలమైన శక్తిగా తయారు చేసింది కాంగ్రెస్‌ పార్టీనే అని అన్నారు. కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదులో నల్లగొండ పార్లమెంట్‌ నెంబర్‌వన్‌ స్థానంలో ఉందన్నారు. కార్యక్రమాల్లో టీపీసీసీ అధికార ప్రతినిధి సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న, ప్రేమ్‌లాల్‌, శంకర్‌నాయక్‌, వంగవీటి రామారావు, పాలకి అర్జున్‌, బాజన్‌, బాగ్థాద్‌, రజనీకాంత్‌, మాతంగి బసవయ్య, నగే్‌షముదిరాజ్‌, అనురాధ, మంజులరెడ్డి, తన్నీరు మల్లికార్జున్‌, యరగాని నాగన్న, చెవిటి వెంకన్న, అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్‌, సాముల శివారెడ్డి, అల్లం ప్రభాకర్‌రెడ్డి, కొట్టె సైదేశ్వరరావు, పద్మ, మంజూనాయక్‌, పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:57:23+05:30 IST