Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

సూర్యాపేటటౌన్‌, డిసెంబరు 3 : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ పార్లమెంట్‌ ఇన్‌చార్జి వినోద్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పట్టణ బ్లాక్‌, మం డల అధ్యక్షులతో శుక్రవారం నిర్వహించిన డిజిటల్‌ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. సభ్యత్వ నమోదును పూర్తిగా డిజిటల్‌ రూపంలో చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, ఏఐసీసీడిజిటల్‌ మీడియా కోఆర్డీనేటర్‌ దీపక్‌జాన్‌, చకిలం రాజేశ్వర్‌రావు, బైరు శైలేందర్‌గౌడ్‌, అంజద్‌అలీ, వంగవీటి రామారావు, మల్లిఖార్జున్‌, కోతి గోపాల్‌రెడ్డి, వాసుదేవరావు, అరుణ్‌కుమార్‌, వీరన్ననాయక్‌, శ్రీనివా్‌సరెడ్డి, మంజునాయక్‌, కొండపల్లి సాగర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement