కనుల పండువగా విగ్రహాల సంప్రోక్షణ

ABN , First Publish Date - 2022-06-24T05:22:57+05:30 IST

శ్రీఆనందగిరి లక్ష్మీ వేంకటేశ్వ ర స్వామి గోదాదేవి సమేత ఆలయంలో నూతన వి గ్రహాల సంప్రోక్షణ ఉత్సవాలు మూడు రోజుల పాటు కనుల పండువగా వేదపండితుల మంత్రోచ్ఛారణలతో జరిగాయి.

కనుల పండువగా విగ్రహాల సంప్రోక్షణ
స్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తున్న వేద పండితులు

- వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన

- జనసంద్రంగా మారిన ఆలయ ప్రాంగణం

- హాజరైన ఎమ్మెల్యే మర్రి, ఎమ్మెల్సీ కూచకుళ్ల

బిజినేపల్లి, జూన్‌ 23: శ్రీఆనందగిరి లక్ష్మీ వేంకటేశ్వ ర స్వామి గోదాదేవి సమేత ఆలయంలో నూతన వి గ్రహాల సంప్రోక్షణ ఉత్సవాలు మూడు రోజుల పాటు కనుల పండువగా వేదపండితుల మంత్రోచ్ఛారణలతో జరిగాయి. గురువారం ఆలయ ప్రాంగణంలో ధ్వ జస్తంభ ప్రతిష్ఠాపనను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణ లతో వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయం లో నూతనంగా సంప్రోక్షణ నిర్వహించి ప్రతిష్ఠించిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవం, ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపనలో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రె డ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఆనందగిరిపై స్వామి వారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిన ఆలయ కమిటీ సభ్యులను, ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు గ్రామానికి చెందిన గంగనమోని తిరుపతయ్య, గంగనమోని రాములు, అనిల్‌గౌడ్‌, దామగట్ల పరమేశ్వర్‌రెడ్డిలు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు వెంకట్రామిరెడ్డి, కర్నాటి తిరుపతయ్య, రాజేందర్‌గౌడ్‌, పులేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గంగనమోని కురుమయ్య, ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ నాయినోళ్ల బాల్‌రాజు గౌడ్‌, రైతుబంధు మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-24T05:22:57+05:30 IST