Abn logo
Sep 20 2021 @ 00:43AM

ప్రజాతీర్పు ముందు కుట్రలు తేలిపోయాయి

మాట్లాడుతున్న కిల్లి కృపారాణి

 వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు కృపారాణి


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: ప్రజాతీర్పు ముందు కుట్రలు, కుతంత్రాలు తేలిపో యాయని వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆమె జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ స్థానాలు గెలుచు కోవడం ప్రభుత్వ పాలనకు నిదర్శనమని చెప్పారు. పోటీచేస్తే ఘోరమైన ఫలి తాలు వస్తాయని ముందే ఊహించిన టీడీపీ ఎన్నికలను బహిష్కరించిందని ఎద్దేవా చేశారు. పలుచోట్ల ఆ పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా పోటీకి దిగిన అభ్యర్థులు కూడా బోర్లా పడ్డారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు సొంత నియోజకవర్గంలోనే టీడీపీ అడ్రసు గల్లంతయ్యిందన్నారు. ఎన్ని కలు ఎప్పుడు వచ్చినా వైసీపీదే  గెలుపని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణలో కార్యకర్తలు బాణసంచా కాల్చారు.  వైసీపీ అభిమానులు  కృపారాణికి కేక్‌ తినిపించారు.