రాజ్యాంగ స్ఫూర్తి దేశానికి ప్రాణవాయువు

ABN , First Publish Date - 2022-06-13T05:05:27+05:30 IST

భారత రాజ్యాంగ స్ఫూర్తి దేశానికి ప్రాణవాయువులాంటిదని పలు ప్రజాసంఘాల నాయకులు ఉద్ఘాటించారు.

రాజ్యాంగ స్ఫూర్తి దేశానికి ప్రాణవాయువు
రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న యం.రాఘవాచారి

- రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తల ఉద్ఘాటన

పాలమూరు, జూన్‌ 12 : భారత రాజ్యాంగ స్ఫూర్తి దేశానికి ప్రాణవాయువులాంటిదని పలు ప్రజాసంఘాల నాయకులు ఉద్ఘాటించారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని విజన్‌గార్డెన్‌లో రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమా వేశం జరిగింది. కమిటీ చైర్మన్‌ రహమాన్‌సూఫి, కన్వీనర్‌ జి.సుధాకర్‌ అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ దేశంలో వస్తున్న సమస్త సామా జిక, రాజకీయ విపత్తులకు పరిష్కారం రాజ్యాంగం లో ఉందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే చర్చ కుట్రపూరితంగా జరుగుతోందన్నారు. దేశంలోని సహజ వనరులను సకల సంపదలను బహుళజా తి సంస్థలకు అప్పనంగా అందజేసేందుకు రాజ్యాం గాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచుగా రాజ్యాంగా న్ని మారుస్తామని ప్రకటనలు చేయటం దేశభవి ష్యత్తుకు ప్రమాదకరమన్నారు. రాజ్యాంగాన్ని మా ర్చి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలనే కుట్రను ప్రజానీకం ప్రతిఘటించాలని కోరారు. సమావే శం లో ఎమ్మార్‌ జేఏసీ కన్వీనర్‌ ఎండీ హనీఫ్‌ అహ్మ ద్‌, టీఎప్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం ఖలీల్‌, రాజ్యాంగపరిరక్షణ కమిటీ కన్వీనర్‌ గట్టు రాములు, అబ్దుల్‌ రజాక్‌, లక్ష్మయ్య, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ యం.రాఘవాచారి, డీటీ ఎఫ్‌ వామన్‌కుమార్‌, వెంకటేష్‌, వెంకటస్వామి, మౌలానా, నాసార్‌, సంజీవ్‌, నిజాం,ఖాజామైనుద్దీ న్‌, మౌలానా నూరుద్దీన్‌, కృష్ణ, నాగయ్య, రాములు, రామ్మోహన్‌, సమద్‌ ఖాన్‌, ఇబ్రహీంఖాద్రీ, అలీమ్‌, మీర్‌మహబూబ్‌అలీ, రహీం, కౌసర్‌, రహమాన్‌, అ హ్మద్‌ హాజీ సలీమ్‌ పాల్గొన్నారు. 

 కృష్ణాజలాల సాధన కోసం 21న ధర్నా 

మహబూబ్‌నగర్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతిప్ర తినిధి) : మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణాజలాల్లో న్యాయమైన వాటా సాధించే నిమి త్తం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని భగత్‌ సింగ్‌ ధర్నాచౌక్‌లో ఈనెల 21న ధర్నా నిర్వహి స్తున్నామని పాలమూరు అధ్యయనవేదిక కన్వీ నర్‌ ఎం. రాఘవాచారి ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ ధర్నాకు ప్రజాస్వామికవాదు లు, మేధావులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీ లను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగబ ద్ధంగా రావాల్సిన కృష్ణాజలాల సాధన కోసమే  ధర్నా నిర్వహిస్తున్నామని, అందరూ రావాలని కో రారు. కార్యవర్గసభ్యులు తిమ్మప్ప, కేసీ వెంకటే శ్వర్లు, ఇక్బాల్‌పాషా, హన్మంతు, బుచ్చన్న, శాంత న్న, వెంకట్‌గౌడ్‌, బాలజంగయ్య,  రవీంద్రనాథ్‌, నర్సింహులు ప్రకటన చేసినవారిలో ఉన్నారు. 

Updated Date - 2022-06-13T05:05:27+05:30 IST