Advertisement
Advertisement
Abn logo
Advertisement

భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని బలోపేతం చేయాలి

ఆత్మకూరు(ఎం), డిసెంబరు 1: భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చ ట్టాన్ని బలోపేతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ మ్రాన డిమాండ్‌ చేశారు. బుధవారం మండలంలోని పల్లెపహాడ్‌ గ్రా మంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ రంగంలో 50 ఏళ్లు నిండిన ప్రతి కార్మికునికి నెలకు రూ.3 వేల పింఛన ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిర్మాణాల్లో వాడే ముడి సరుకుల ధరలు తగ్గించి, వాటిపై జీఎస్టీ పన్ను తొలగించాలన్నారు. స మావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కుసుమని హరిశ్చంద్ర, నా యకులు కూరెళ్ల మత్స్యగిరి, బిక్షపతి, పరశురాములు, జాని పాల్గొన్నారు. 

రామన్నపేట: దేశవ్యాప్తంగా ఈ నెల 2,3 తేదీల్లో జరిగే భవన నిర్మా ణ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మామిడి వెంకట్‌రెడ్డి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని సీఐటీ యూ కార్యాలయంలో నిర్వహించిన పెయింటింగ్‌ వర్కర్స్‌, భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముడి సరుకులు ఇనుము, సిమెంట్‌, ఇసుక, ధరలు విపరీతంగా పెంచడంతో భవన నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల్లో కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు గాదె కృష్ణ, వంగాల మారయ్య, ఇలియాజ్‌, తెల్ల శేఖర్‌, గోరిగె ఆది మల్లయ్య,  నాగరాజు, శ్రీరాములు, రమేష్‌, మల్లేశం పాల్గొన్నారు. 


Advertisement
Advertisement