Advertisement
Advertisement
Abn logo
Advertisement

మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న మెడికల్‌ కళాశాల, ఎంసీహెచ్‌ ఆసుపత్రిలోని అదనపు పడ కల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ గుగులో తు రవి నాయక్‌ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలో జరుగుతున్న మెడి కల్‌ కళాశాల భవన నిర్మాణ పనులు, ఎంసీహెచ్‌ ఆసుపత్రిలోని అదనపు పడకల నిర్మాణ పనులు, చల్‌గల్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్మి స్తున్న మామిడి దుకాణాల సముదాయ నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీ లించారు. అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సలహాలు, సూచనలు, ఆదేశా లు అందించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడారు. పనులను వేగం గా పూర్తి చేయడానికి అవసరం మేరకు కూలీలను అదనంగా ఉప యోగించుకోవాలని తెలిపారు. కాంట్రాక్టర్‌ నాణ్యత ప్రమాణాలను పా టించాలని, నిర్మాణ పనులను ప్రతీ నిత్యం అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. సాద్యమైనంత తొందరలో భవనాలు ప్రారంభించడానికి సిద్దం చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ ఏడీ ప్ర కాశ్‌, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరెండెంట్‌ సుదక్షిణాదేవీ, ఆర్‌ఎంఓ రామకృష్ణ, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement