కరోనాకు చంపేంత శక్తిలేదు

ABN , First Publish Date - 2020-08-01T07:29:13+05:30 IST

కరోనా వైర్‌సకు చంపగలిగే శక్తిలేదు.. అలాగనీ దానిని నిర్లక్ష్యం చేస్తేనే ప్రమాదం. కొవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల

కరోనాకు చంపేంత శక్తిలేదు

ఖమ్మం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ‘కరోనా వైర్‌సకు చంపగలిగే శక్తిలేదు.. అలాగనీ దానిని నిర్లక్ష్యం చేస్తేనే ప్రమాదం. కొవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం ఖమ్మం వచ్చిన ఆయన మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కోవిడ్‌-19 ట్రూనాట్‌, కరోనా నిర్ధారణ కేంద్రాన్ని, కార్డియాలజిస్ట్‌, యూరాలజిస్ట్‌ విభాగాల్లో ఐసీయూ బెడ్ల వార్డులు, మమత ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని, 72 పడకల ప్రత్యేకవార్డును ఆయన ప్రారంభించారు. అనంతరం ఖమ్మం జిల్లాలో వైద్యశాఖ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై జడ్పీ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. నూటికి 81ు మందికి కరోనా లక్షణాలు కనిపించడంలేదని, వచ్చినట్టు కూడా వారికి తెలియడం లేదని, చివరికి వ్యాధి తగ్గుతున్నదని చెప్పారు. 14ు మందికి లక్షణాలుంటాయని, వారికి వెంటిలేటర్లు అవసరం లేకుండానే ఆక్సిజన్‌ సాయంతో వ్యాధి నయం అవుతుందని తెలిపారు. మిగిలిన 5ు మంది వ్యాధినిరోధక శక్తి సరిగ్గా లేనివారు, బీపీ, మధుమేహం ఎక్కువగా ఉన్నవారు, గర్భిణులు, చిన్నపిల్లలు, పెద్దవయసున్నవారికి వైరస్‌ సోకినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నిర్లక్ష్యం చేయకుండా 24 గంటల్లోపు వారినీ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లయితే.. 99ు బతికించే అవకాశం ఉంటుందని తెలిపా రు. వెయ్యి రూపాయల ఖర్చుతో నయమయ్యే రోగాన్ని.. భయంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి లక్షల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నాని ఆయన చెప్పారు.

Updated Date - 2020-08-01T07:29:13+05:30 IST