అంతులేని విషాదం

ABN , First Publish Date - 2021-05-09T08:23:01+05:30 IST

కరోనా మహమ్మారి కుటుంబాలను కబళించివేస్తోంది. రక్తసంబంధీకులను దూరం చేస్తూ అంతులేని విషాదం నింపుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరోజు వ్యవధిలోనే ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందారు

అంతులేని విషాదం

24 గంటల్లో ముగ్గురు అన్నదమ్ముల మృతి


తణుకు, మే 8: కరోనా మహమ్మారి కుటుంబాలను కబళించివేస్తోంది. రక్తసంబంధీకులను దూరం చేస్తూ అంతులేని విషాదం నింపుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరోజు వ్యవధిలోనే ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందారు. తణుకులో ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న 55 ఏళ్ల వ్యక్తికి వారం రోజుల క్రితం కరోనా సోకింది. మొదట తణుకు, తర్వాత కాకినాడ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయారు.  కాకినాడలో ఆయన సోదరుడు అంత్యక్రియలు నిర్వహించారు. దహన సంస్కారాలు పూర్తయిన కాసేపటికే.. ఏలూరు ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న మరో సోదరుడు (53) మృతిచెందాడన్న వార్త వచ్చింది. ముందే విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులకు ఈ విషయం మరింత బాధించింది. ఏలూరుకు వెళ్లి దహన సంస్కారాలు చేసి ఇంటికి తిరిగి వచ్చారు. ఇద్దరు సోదరుల మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఆఖరి తమ్ముడు శనివారం గుండెపోటుతో చనిపోయారు. ఒక్కరోజు వ్యవధిలోనే ముగ్గు రు అన్నదమ్ములు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2021-05-09T08:23:01+05:30 IST