కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి

ABN , First Publish Date - 2021-04-20T06:23:55+05:30 IST

ఆయా గ్రామాల్లోని ఆరో గ్య ఉపకేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు అం దుబాటులో ఉంచాలని కలెక్టర్‌ సంగీత సత్యనారా యణ అధికారులను ఆదేశించారు.

కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌

- ఆరోగ్య సిబ్బంది మెరుగైన వైద్యసేవలు అందించాలి 

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

జూలపల్లి, ఏప్రిల్‌ 19: ఆయా గ్రామాల్లోని ఆరో గ్య ఉపకేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు అం దుబాటులో ఉంచాలని కలెక్టర్‌ సంగీత సత్యనారా యణ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంను సోమవారం కలెక్ట ర్‌ ఆకస్మికంగా తనిఖీచేసి ఆసుపత్రిని దాని పరిస రాలను పరిశీలించారు. కరోనా బాధితులకు మెరు గైన సేవలను అందించాలన్నారు. బాధిత ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరోగ్య సిబ్బందిని అడిగి తె లుసుకున్నారు. కరోనా నివారణ టీకాలకు 45 సంవ త్సరములు నిండిన  వారికి వేయాలని, అలాగే కరో నా టెస్టులను సైతం వారి గ్రామాల్లోనే చేసి జనస మూ హాలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టా లన్నారు. అనంతరం  పెద్దాపూర్‌, జూలపల్లి గ్రా మాల్లో పల్లెప్రగతి పనులు, శ్మశానవాటికల నిర్మా ణాలు, నర్సరీలను ఆమె పరిశీలించారు. పనులను వేగవంతం చేయించి సకాలంలో పూర్తిచేయించాల ని  అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమా ల్లో  తహసీల్దార్‌ సుధాకర్‌, ఎంిపీడీవో వేణుగోపాల్‌ రావు, ఎంపీవో రమేష్‌, డాక్టర్‌ హుమాయూన్‌, ఏపీ వో సదానందం, కార్యదర్శి అనంతుల లచ్చయ్య, ఉపసర్పంచ్‌ కొప్పుల మహేష్‌, బీజేవైఎం నాయకు లు కంకనాల జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-20T06:23:55+05:30 IST